ఇటీవలే భారీ ఎత్తున విడుదలైన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రాన్ని అనంతపూర్ లో పైరసీ చేస్తున్న వారిని యాంటీ పైరసీ టీం పట్టుకుంది. పోలీసు డిపార్ట్ మెంట్ తో కలిసి ఈ యాంటీ పైరసీ టీం అనంతపూర్ కమలానగర్ లోని తిరుమల వీడియోస్ షాప్ మీద రైడ్ చేసి పట్టుకున్నారు మరియు వీళ్ళే ఆ టౌన్ అంతా పైరసీలు చేసి అమ్ముతున్నారు.
‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ యాంటీ పైరసీ టీం పైరసీ దారుల కోసం తీవ్రంగా గాలింపులు జరుపుతోంది మరియు పైరసీకి పాల్పడిన వారు ఎవరైనా సరే వారిని పట్టుకుంటోంది. ‘ ప్రతి ప్రింట్ లోను వాటర్ మార్క్ టెక్నాలజీ వాడాము, దాని ద్వారానే మేము తెలుసుకోగలుగుతున్నాం మరియు పోలీసులతో కలిసి ఇలా దొంగతనంగా పైరసీ చేసే వాళ్ళను కచ్చితంగా పట్టుకుంటాము. సినీ అభిమానులారా థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి, పైరసీలు చూడవద్దని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం’ అని యాంటీ పైరసీ టీం సభ్యులు అన్నారు.