సెన్సార్ పూర్తి చేసుకున్న “యముడికి మొగుడు”

సెన్సార్ పూర్తి చేసుకున్న “యముడికి మొగుడు”

Published on Dec 21, 2012 9:44 AM IST

Allari-Naresh-Yamudiki-Mogu
కామెడీ కింగ్ అల్లరి నరేష్ సోషియో ఫాంటసీ చిత్రం “యముడికి మొగుడు” చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి ఈ చిత్రం U/A సర్టిఫికేట్ అందుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం డిసెంబర్ 28 విడుదలకు సిద్దమయ్యింది. “సుడిగాడు” వంటి విజయం తరువాత రాబోతున్న అల్లరి నరేష్ చిత్రం ఇదే. ఈ చిత్రంలో రిచా పనయ్ కథానాయికగా నటిస్తుండగా ఈ.సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. షాయాజీ షిండే యముడి పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో యముడి కూతురిని ప్రేమించే యువకుడి పాత్రలో నరేష్ కనిపించనున్నారు. ప్రముఖ నటి రమ్యకృష్ణ యముడి భార్యగా కనిపించనున్నారు. చంటి అడ్డాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు