సాయి ధరం తేజ్ , సయామీ ఖేర్ తో పాటు దర్శక నిర్మాత వై. వి. యెస్. తన మ్యూజికల్ లవ్ స్టొరీ ‘రేయ్’ లో ప్రముఖ టి. వి. నటుడు అర్పిత్ రంక ని ఒక విలన్ రోల తో పరిచయం చేయనున్నాడు.
అర్పిత్ రంక స్టార్ ప్లస్ లో ప్రసారం అవుతున్న ‘మహాభారతం’ లోని దుర్యోధనుడి పాత్ర తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రేయ్’ అర్పిత్ మొదటి తెలుగు సినిమా, ఈ సినిమాలో శ్రద్ధా దాస్ ని ప్రేమిస్తున్న ఒక ఇంటర్నేషనల్ డాన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు.
గుణ శేఖర్ 3 డి చిత్రం ‘రుద్రమ దేవి’ లో కూ డా అర్పిత్ నటించనున్నాడు. ‘రుద్రమ దేవి’ లోని అర్పిత్ పాత్ర కి సంభందించిన విషయాలు ఇంకా తెలియవలసివుంది.