తూనీగా తూనీగా సెన్సార్ తేది ఖరారు


అభిరుచిగల నిర్మాత ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ” తూనీగా తూనీగా” చిత్రం జూలై 16న సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుందని సమాచారం. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ద్వారా ఎం ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. దిల్ రాజు సమర్పణలో పద్మిని ఆర్ట్స్ బ్యానర్ పైన మాగంటి రాంజీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రియా చక్రభోర్తి ఈ చిత్రంతో కథానాయికగా పరిచయంకానున్నారు. ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ వస్తుందని నిర్మాత రాంజీ ఎంతో ధీమాగా ఉన్నారు మరియు ఈ చిత్రాన్ని జూలై 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్లో ఈ చిత్రం ప్లాటినం డిస్క్ వేడుకను జరుపుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, వి.వి.వినాయక్, అల్లు అరవింద్, నాగబాబు, సునీల్, శ్యాం ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు మరియు పరుచూరి బ్రదర్స్ ఈ వేడుకకి ముఖ్య అతిదులుగా విచ్చేశారు. కార్తీక్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version