‘తూనీగ తూనీగ’ చిత్రానికి పాజిటివ్ టాక్


ప్రముఖ ప్రొడ్యూసర్ ఎం.ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయమవుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘తూనీగ తూనీగ’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది మరియు చిత్ర ప్రరిశ్రమలో ఈ చిత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫుల్ కామెడీ మరియు రొమాంటిక్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్ర వారం(జూలై 20) విడుదల కానుంది. ఈ చిత్రం మల్టీప్లెక్సుల్లో అత్యంత భారీగా విడుదలవుతున్న హాలీవుడ్ మూవీ ‘ది డార్క్ నైట్ రైసెస్’ చిత్రంతో పాటు విడుదల కానుంది.

రియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజా సంగీతం అందించారు. ఎం రాంజీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ కెమెరామెన్ ఎస్. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.

Exit mobile version