మొదలైన బన్ని – త్రివిక్రమ్ మూవీ

మొదలైన బన్ని – త్రివిక్రమ్ మూవీ

Published on Apr 10, 2014 12:45 PM IST

Allu-Arjun
సూపర్ హిట్ కాంబినేషన్ అనగానే ఆడియన్స్ కి సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. అలాంటి కాంబినేషన్ లోనే ఈ రోజు ఓ సినిమా మొదలైంది. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త మూవీ ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో లాంచనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ప్రముఖులైన డా. డి. రామానాయుడు, శ్యాం ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, బండ్ల గణేష్, మారుతి, తమ్మారెడ్డి భరద్వాజ్ తదితరులు హాజరయ్యారు. మొదటి సీన్ కి అల్లు అర్జున్ క్లాప్ నివ్వగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మూవీతో మొదటి సారి అల్లు అర్జున్ – సమంత మొదటి సారి జోడీ కడుతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్నారు.

తాజా వార్తలు