త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ?

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ?

Published on Mar 29, 2020 11:00 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం తన గత రెండు సినిమాల మాదిరే భిన్నమైన నేపథ్యం ఎంచుకున్నారట. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక మరో కథానాయికగా తన గత రెండు సినిమాల్లో నటించిన పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట త్రివిక్రమ్.’అరవింద సమేత’లో ఎన్టీఆర్, పూజా హెగ్డేల జోడీ చాలా బాగా కుదిరింది. అందుకే మళ్లీ ఆమెనే రిపీట్ చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారని టాక్. మరి పూజా హెగ్డే ఫైనల్ అవుతుందో లేదో తెలియాలంటే కొంత వెయిట్ చేయాల్సిందే.

హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. జులై నుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2021 సమ్మర్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు