పవన్ ఫ్యాన్స్ ని నిరుస్తాహపరుస్తున్న గురూజీ.

పవన్ ఫ్యాన్స్ ని నిరుస్తాహపరుస్తున్న గురూజీ.

Published on Jun 24, 2020 3:00 AM IST

పవన్ కి అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ ఆయనతో మూడు సినిమాలు చేశారు. అజ్ఞాతవాసి నిరాశపరిచినా జల్సా, అత్తారింటికి దారేది మంచి విజయాలు అందుకున్నాయి. చివరి చిత్రం అజ్ఞాతవాసి ఫలితం ఎలా ఉన్నా త్రివిక్రమ్ మూవీలో పవన్ ని చూడాలని ఫ్యాన్స్ ఆశ. అల వైకుంఠపురంలో మూవీ విజయం తరువాత వీరి కోరిక మరింత ఎక్కువైంది.

ఐతే వీరికి కోరిక ఇప్పట్లో తీరే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం త్రివిక్రమ్ సిద్ధం చేసిన స్క్రిప్ట్స్ లో ఒక్కటి కూడా పవన్ కోసం లేదట. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఓ మూవీకి కమిటైన త్రివిక్రమ్ నెక్స్ట్ కూడా పవన్ తో మూవీ చేయడట. ఓ వైపు ఫ్యాన్స్ వీరి కాంబినేషన్ లో మూవీ కోరుకుంటూ ఉంటుంటే.. త్రివిక్రమ్ మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం వారిని భాదిస్తుందట.

తాజా వార్తలు