చాలాకాలం విరామం తరువాత త్రిష ఒక సినిమాను అంగీకరించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ఒప్పుకున్నది త్రిష కన్నడలో చేస్తున్న మొదటి సినిమా. కన్నడ సూపర్ స్టార్లలో ఒకరైన పునీత్ రాజ్ కుమార్ సరసన నటిస్తుంది. ఈ సినిమా తెలుగులో వచ్చిన ‘దూకుడు’కు అధికారిక రిమేక్. త్రిష ఇందులో సమంత పాత్రను భర్తీ చెయ్యనుంది
దూకుడు తెలుగు మాతృకను నిర్మించిన నిర్మాతలు అనీల్ సుంకర, గోపీచంద్ మరియు రామ్ ఆచంట 14రీల్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించి కన్నడ చిత్రసీమలో ప్రవేశించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బళ్ళారి దగ్గర సందూర్ అనే ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది. “కన్నడ ప్రజల అభిమానానికి, మర్యాదకి ముగ్దురాలినయ్యా..” అని త్రిష ట్వీట్ చేసింది
ఈ సినిమానే కాక త్రిష ‘ఎంద్రేద్రమ్ పున్నాగై’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమానే కాక ‘రమ్’లో కూడా నటిస్తుంది