వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్‌లో చాలా హుషారుగా పాల్గొంటున్నారు. అయితే, తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మోహన్ శ్రీవత్స ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ చాలా వైవిధ్యంగా ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఓ క్రైమ్ థ్రిల్లర్ కథకు మైథాలజీ టచ్ యాడ్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మనకు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక సత్యరాజ్ తన పాత్రలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయంగా ఈ ట్రైలర్‌లో కనిపిస్తుంది.
సత్యరాజ్ తో పాటు ఈ సినిమాలో వశిష్ఠ సింహా, సత్యం రాజేష్, ఉదయ భాను, సాంచి రాయ్, క్రాంతి కిరణ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ సంగీతం అందించగా, దర్శకుడు మారుతి టీమ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి