ప్రస్తుతం ఇండియన్స్ అందరూ ఐపీఎల్ 2025 సీజన్ కోసం రెడీ అవుతున్నారు. ఈ టోర్నమెంట్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సీజన్ టోర్నీ మార్చి 22 నుండి ప్రారంభం కానుండటంతో క్రికెట్ అభిమానులకు పండుగ సీజన్ స్టార్ట్ అయినట్లే. అయితే, ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది.
ఈ జట్టు గతేడాది ఫైనల్ వరకు వెళ్లింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ ఊచకోత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. ఇక తాజాగా ఐపీఎల్ 2025 కోసం ఆయన హైదరాబాద్ చేరుకున్నాడు. ఇదే విషయాన్ని SRH టీమ్ తమదైన విధంగా నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ బీజీఎం తో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ట్రావిస్ హెడ్ ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఎలాంటి విజయాలను అందిస్తాడో వేచి చూడాలి.
HeadMASSSter has arrived ????
Travis Head | #PlayWithFire pic.twitter.com/N8QAldIjd2
— SunRisers Hyderabad (@SunRisers) March 17, 2025