సూర్య ‘రెట్రో’ ట్రైలర్ డేట్ వచ్చేసింది..!

సూర్య ‘రెట్రో’ ట్రైలర్ డేట్ వచ్చేసింది..!

Published on Apr 14, 2025 9:03 PM IST

కోలీవుడ్ విలక్షణ హీరోల్లో ఒకరైన సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న సాలిడ్ గ్యాంగ్ స్టర్ చిత్రం “రెట్రో”. టీజర్ తోనే మంచి బజ్ ని సంతరించుకున్న ఈ చిత్రం ఇపుడు ఒకొకటిగా పాటలు ఇతర ప్రమోషనల్ కంటెంట్ తో ముందుకు వస్తుంది. ఇక లేటెస్ట్ గా ఈ చిత్రం తాలూకా అవైటెడ్ ట్రైలర్ కట్ ని ఎపుడు రిలీజ్ చేస్తారు అనేది ఇపుడు ఫిక్స్ చేసేసారు.

ఈ ఏప్రిల్ 18న అటు ట్రైలర్ సహా సినిమా ఆడియో లాంచ్ రెండు కూడా చేస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు రివీల్ చేశారు. తమిళ నాట గ్రాండ్ గా ఆడియెన్స్ ఫంక్షన్ చేస్తుండగా అదే రోజున సాయంత్రం ట్రైలర్ రానుంది. ఇక దీనికి టైం ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సూర్య కూడా నిర్మాతగా ఈ చిత్రానికి వ్యవహిస్తున్నారు. అలాగే ఈ మే 1న చిత్రం గ్రాండ్ గా తమిళ్, తెలుగు భాషల్లో కూడా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు