కరోనా వ్యాక్సిన్ కోసం రక్తం ఇచ్చిన స్టార్ కపుల్.

కరోనా వ్యాక్సిన్ కోసం రక్తం ఇచ్చిన స్టార్ కపుల్.

Published on Apr 15, 2020 10:00 PM IST

హాలీవుడ్ హీరో టామ్ హ్యాంక్స్‌, ఆయన భార్య రీటా విల్సన్‌ కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా విహారానికి వెళ్లిన ఈ జంటలకు అక్కడ ఈ వైరస్ బారిన పడ్డారు. అక్కడే వైద్యంతీసుకున్న వీరిద్దరు 14 రోజుల క్వారెంటైన్ తర్వాత తిరిగి అమెరికా వెళ్లారు. కాగా టామ్ హ్యాంక్స్ దంపతులు, కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ కోసం సహకరిస్తున్నారు. దీనిలో భాగంగా వారిద్దరూ తమ రక్తాన్ని దానం చేశారు.

తమ శరీరాల్లో ఉన్న యాంటీబాడీలు వ్యాక్సిన్ తయారీకి ఉపయోగపడుతాయో లేదో వేచి చూడాల్సి ఉంటుందని రీటా విల్సన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకవేళ వీలైతే తమ ప్లాస్మాను కూడా ఇతర పేషెంట్లకు డొనేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు