2014 ఎన్నికల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనూహ్య రీతిలో రాజకీయాల్లోకి వెళ్తున్నారు. గతంలో లెజెండరీ డా. నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి లు సినిమాలలో నటించడం ఆపేసిన తరువాత రాజకీయాల్లోకి వెళ్లారు. కానీ ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ యువ నటులు ప్రత్యేక్షంగా కానీ, పరోక్షంగా గానీ రాజకీయాల్లో పాల్గొనడానికి సిద్దమవుతున్నారు. కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్లాన్స్ తెలిసిపోనున్నాయి. పవన్ తో పాటుగా జూనియర్ ఎన్ టి ఆర్ కూడా ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయనున్నాడని సమాచారం.
ఈ సంవత్సరం మరో సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏమిటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు కూడా ఈ సంవత్సరం అతని తరుపున ప్రచారం చేస్తారని గల్లా జయదేవ్ తెలియజేశాడు. దీనితో మహేష్ బాబు కూడా ఈ సారి ఎన్నికల స్టేజ్ ఎక్కనున్నాడనిపిస్తుంది. ఈ పెద్ద నటులతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ చిన్న నటులు కూడా చాలా మంది తెలుగు దేశం పార్టీ తరుపున ప్రచారం చేయనున్నారు. అదే విదంగా పవన్ కళ్యాణ్, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా సినిమా నటులతో ప్రచారం చేయించనున్నట్టు తెలిసింది.
అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది పెద్దలు ఈ సంవత్సరం జరగనున్న సాదారణ ఎన్నికల్లో పోటి చేయడానికి సిద్దమవుతున్నారు.