తెలుగు సినిమా ఫెడరేషన్ ఇప్పుడు తీసుకున్న షాకింగ్ నిర్ణయం తెలుగు సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. రేపటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ అన్ని నిలిపేస్తున్నట్టుగా తెలుగు ఫిలిం ఫెడరేషన్ వారు ఇప్పుడు ప్రకటించారు. ఫెడరేషన్ నాయకులు తమకి వేతనాలు విషయంలో వచ్చిన ప్రెస్ నోట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ 04-08-2025 సోమవారం నుండి 30% వేతనాలు ఇస్తామని, ప్రొడ్యూసర్ నుండి సంభందిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే, సంభందిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్ లకు తెలియజేసిన తరువాత మాత్రమే విధులకు వెళ్లాలని నిర్ణయించడమైనది అని అప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు సంబందించిన సభ్యులు ఎవరు కూడా సినిమాకు గాని, వెబ్ సిరీస్ ల షూటింగ్ లకు గాని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నుండి అనుమతి లేనిదే ఎటువంటి విధులకు యూనియన్ మరియు అసోసియేషన్ సభ్యులు హాజరు కాకూడదని డిసైడ్ చేసినట్టు అనౌన్స్ చేశారు. దీనితో ఈ ప్రెస్ నోట్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.