తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో సినీ నిర్మాతల భేటి

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె కారణంగా పలు చిత్రాల షూటింగ్స్ వాయిదా పడుతున్నాయి. దీంతో నిర్మాతల మండలి తాజాగా తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు.

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు జెమిని కిరణ్, ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, యార్లగడ్డ సుప్రియ, భోగవల్లి బాపినీడు తదితరులు భేటి అయ్యారు. సినిమా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై ఆయనతో చర్చించారు.

అటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో బివిఎస్ఎన్ ప్రసాద్, డివివి దానయ్య, కెఎల్ నారాయణ, భరత్(ఛాంబర్ ప్రెసిడెంట్), నాగవంశీ, యేర్నేని రవి శంకర్, టి.జి.విశ్వ ప్రసాద్, చెర్రి(మైత్రీ మూవీస్), వంశీ(యూవీ క్రియేషన్స్), వివేక్ కుచిబొట్ల, సాహు గారపాటి సమావేశమయ్యారు. సినిమా పరిశ్రమలో జరుగుతున్న స్ట్రైక్ గురించి ఆయనకు వివరించారు.

దీంతో కందుల దుర్గేష్ ఈ సమస్యపై సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కూడా చర్చిస్తానని.. వీలైనంత వరకు సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని నిర్మాతలకు హామీ ఇచ్చారు.

Exit mobile version