లేటెస్ట్ గా మన తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ సినిమానే “కన్నప్ప”. మంచు విష్ణు హీరోగా ప్రభాస్, అక్షయ్ కుమార్ ఇంకా అనేకమంది బిగ్ స్టార్స్ కలయికలో వచ్చిన ఈ సినిమా విడుదల రోజే చాలా అంచనాలు పటాపంచలు చేసి అదరగొట్టింది. ఇలా ఒక సాలిడ్ స్టార్ట్ ని అందుకున్న ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అంటూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలి ట్విస్ట్ ఇచ్చారు.
అయితే మన తెలుగులో ఆయా సినిమాల తాలూకా ఫలితాలని హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఆ తర్వాత ఇండస్ట్రీ అన్ని రికార్డులు తిరగరాస్తే అప్పుడు ఇండస్ట్రీ హిట్ అని వేసుకుంటారు. కానీ ఇది జరగాలంటే ఆ సినిమాకి భారీ లాంగ్ రన్ తప్పనిసరి కానీ సినిమా వచ్చిన మొదటి రోజు రన్ తర్వాతే మేకర్స్ కన్నప్ప సినిమాని ఇండస్ట్రీ హిట్ అంటూ చెప్పడం ఒకింత ఆశ్చర్యమే అని చెప్పక తప్పదు.
అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ అనే కోణంతో వేసి ఉండొచ్చు అనే పాయింట్ కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ నడుమ చర్చగా నడుస్తుంది. ఈ మధ్య కాలంలో పోస్టర్స్ రచ్చ మన తెలుగు సినిమాలో ఎలా ఉంటుందో తెలిసిందే. భారీ వసూళ్లు నుంచి ఇపుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యిందా అనుకోవాలేమో..