పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ నుంచి తాజాగా ఓ బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. హరిహర వీరమల్లు చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ అండ్ టైం ఫిక్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 3న ఉదయం 11.10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ సాలిడ్ పోస్టర్‌తో ఈ అనౌన్స్మెంట్ చేశారు. యుద్ధానికి తుపాకి పట్టుకుని సిద్ధంగా ఉన్న వీరమల్లు లుక్ అదిరిపోయింది. ఈ లుక్‌లో పవర్ స్టార్‌ని చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక ఈ ట్రైలర్ ఎలాంటి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించగా క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.