మంచు విష్ణు హీరోగా ఎప్పుడు నుంచో ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అలా జిన్నా తర్వాత తన నుంచి వచ్చిన భారీ చిత్రమే “కన్నప్ప”. దర్శకుడు ముఖేష్ కుమార్ తో మంచు విష్ణు, కథ కథనాలతో వచ్చిన ఈ చిత్రం తన కెరీర్ లోనే భారీ హిట్ దిశగా వెళుతుంది. అయితే ఈ సినిమా విష్ణు కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా చెబుతున్నాయి.
లేటెస్ట్ గా వచ్చిన పిఆర్ లెక్కల ప్రకారం కన్నప్ప చిత్రం డే 1 కి గాను ఏకంగా 20 కోట్ల ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ గా కొట్టినట్టు తెలుస్తుంది. దీనితో మంచు విష్ణు కంబ్యాక్ తన కెరీర్లోనే ఒక రికార్డు బ్రేకింగ్ కంబ్యాక్ గా నిలిచింది అని చెప్పవచ్చు. మరి పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ తారాగణంతో తెరకెక్కించిన ఈ సినిమా అందరు ఫ్యాన్స్ అంచనాలు రీచ్ అవ్వడం విశేషం. ఇక ప్రస్తుతం డే 2 కూడా థియేటర్స్ లో సాలిడ్ బుకింగ్స్ ని కన్నప్ప చూపిస్తుంది. ఇక ఈ రెండు రోజులు వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.