పైరసీని అరికట్టడానికి టాలివుడ్ మరియు హాలివుడ్ ల ఒప్పందం

పైరసీ మీద పోరాటానికై తెలుగు చిత్ర పరిశ్రమ మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(ఎంపిఎఎ)తో చేయి కలిపింది. మార్చ్ 23న ఎంపిఎఎ బృందం పరిశ్రమ పెద్దలయిన సురేష్ బాబు,శ్యాం ప్రసాద్ రెడ్డి,అల్లు అరవింద్,కే.అశోక్ కుమార్ మరియు సి కళ్యాణ్ లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందంలో సంతకం చేశారు. పైరసీ మూలాన మాత్రమే తెలుగు చిత్ర పరిశ్రమ 338 కోట్లకు పైగా నష్టపోయింది. ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన వార్నర్ బ్రదర్స్,20త్ సెంచురీ ఫాక్స్,వాల్ట్ డిస్నీ,సోనీ,పారామౌంట్ మరియు యూనివర్సల్ వంటి స్టూడియోలు ఎంపిఎఎ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఎంపిఎఎ వారు పైరసీ ని అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ ఎంఓయు తెలుగు చిత్ర నిర్మాతలకు ఆన్ లైన్ పైరసీని అడ్డుకునేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

Exit mobile version