కొత్త కథల్ని సెలెక్ట్ చేసుకునే పనిలో హీరోలు

కొత్త కథల్ని సెలెక్ట్ చేసుకునే పనిలో హీరోలు

Published on Mar 23, 2020 1:36 PM IST

ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే మన టాలీవుడ్ హీరోలు లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కావాల్సినంత ఖాళీ టైమ్ దొరికింది అందరికీ. ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారంతా. గత కొన్ని నెలలుగా తీరిక లేక కొత్త కథలు వినలేకపోయిన హీరోలందరూ ఈ తీరిక సమయాన్ని
వాటి కోసం కేటాయిస్తున్నారట. గతంలో తమ వద్దకు వచ్చిన స్టోరీలను ఇప్పుడు తిరగేస్తున్నారట.

అంతేకాదు తమకు ఎలాంటి కథలు కావాలో రచయితలకు, సన్నిహితులైన దర్శకులకు వివరంగా చెబుతున్నారట. దర్శకులు సైతం హీరోలు ఖాళీగా ఉండటంతో తమ వద్ద ఉన్న కథలను వారి ముందుంచుతూ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. మొత్తానికి ఈ లాక్ డౌన్ పిరియడ్ ముగిసేనాటికి టాలీవుడ్లో కొత్త సినిమాలు, కొత్త కాంబినేషన్లు సిద్ధంకానున్నాయి. మరి ఆ కొత్త ప్రాజెక్ట్స్ ఏమిటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు