ఫిల్మ్ ఇండస్ట్రీకి సమ్మర్ చాలా బిజీ సీజన్ అని చెప్పుకోవాలి. సమ్మర్ హాలిడేస్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని చాలా పెద్ద సినిమాలు ఈ టైం ని రిజర్వ్ చేసుకున్నాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ సమ్మర్లో బిజీగా ఉండనుంది. భారీ బడ్జెట్ సినిమాలు సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాయి. అల్లు అర్జున్ – పూరి జగన్నాథ్ ల ‘ఇద్దరమ్మాయిలతో’, వెంకటేష్ ‘షాడో’, అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’, రవితేజ ‘బలుపు’, నాని ‘పైసా’ మొదలైన సినిమాలు మేలో విడుదల కానున్నాయి. ఈ బిగ్ బడ్జెట్ చిత్రాలు కాకుండా కొన్ని చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి.
ఇటీవలే మొదలైన ఐపిఎల్ వల్ల సినిమాల రెవిన్యూ పై కాస్త ఎఫెక్ట్ కనిపిస్తోంది. అలాగే కరెంట్ కోత వల్ల షోస్ వెయ్యడానికి ఎక్కువగా ఖర్చు అవుతుంది. వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుండడం వల్ల బిజినెస్ బాగా అవుతుందని ఎగ్జిబిట్లర్లు ఆశలు పెట్టుకున్నారు.