
వారంలో వీకెండ్ వస్తోంది అంటే మన బాక్స్ ఆఫీస్ వద్ద ఎదో ఒక సినిమా వచ్చి సినీ అభిమానులను అలరిస్తుంది. గత నెలలో విడుదలైన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మరియు ‘దేనికైనా రెడీ’ సినిమాల తర్వాత ఒక్క చెప్పుకోదగ్గ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో గత రెండు వారాలుగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సినేమాల్లేక వెలవెలబోతోంది. ఈ వారం దీపావళి కానుకగా విడుదల చేద్దామనుకున్న కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి, అలాగే ‘డమరుకం’ కూడా అనుకున్న సమయానికి వస్తుందా? లేదా అన్న అయోమయ స్థితిలో ఉంది. ఈ వారం కూడా ఏ సినిమా రాకపోతే సినీ ప్రేమికులు మరింత నిరుత్సాహానికి గురవుతారు.ఈ పండుగల సీజన్లో సినిమాలు లేకపోవడం టాలీవుడ్ కి పెద్ద నష్టమనే చెప్పుకోవాలి.