‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మంచి కమర్షియల్ పొలిటికల్ మూవీని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత సినిమాల సెలెక్షన్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకే ప్రస్తుతం ఈ చిత్రాన్ని పోస్ట్ ఫోన్ చేసి.. ముందుగా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమాని స్టార్ట్ చేయాలని చూస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అందువల్ల
‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమా ఇప్పట్లో ఉండదు అని సమాచారం.
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేసి..ఆ తరువాత డైరెక్టర్ అట్లీతో కూడా ఓ సినిమా చేసి తమిళంలో కూడా సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా చేయాలనుకున్నాడు. మరి త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తాడా ? లేక ఎం,మహేష్ తో ప్లాన్ చేస్తాడా అనేది చూడాలి.