‘విజయ్ 69’ ఫస్ట్ లుక్‌కు టైమ్ ఫిక్స్

‘విజయ్ 69’ ఫస్ట్ లుక్‌కు టైమ్ ఫిక్స్

Published on Jan 25, 2025 7:01 PM IST

తమిళ స్టార్ హీరో థళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా తన లాస్ట్ మూవీ అని విజయ్ గతంలోనే ప్రకటించాడు.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. జనవరి 26న ఉదయం 11 గంటలకు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో విజయ్ 69 సెలబ్రేషన్స్ మొదలుపెడదాం అంటూ అభిమానులకు మేకర్స్ పిలుపునిచ్చారు.

ఈ సినిమాలో విజయ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, మమితా బైజు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు