ఈ ఏడాది సంక్రాంతి చిత్రాలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ బడా హీరోలైన మహేష్, బన్నీ నటించిన చిత్రాలు రెండు పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు, రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సాధిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టగా, బన్నీ అల వైకుంఠపురంలో సినిమాతో తాను కూడా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న మల్టీ ప్లెక్స్ ఆక్యుపెన్సీ లో ఈ రెండు చిత్రాలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. అనూహ్యంగా రెండు చిత్రాలు సమానమైన మల్టీ ప్లెక్స్ ఆక్యుపెన్సీ కలిగివున్నాయి. ఈ వీకెండ్ జనవరి 10 నుండి 12 వరకు యావరేజ్ మల్టీ ప్లెక్స్ ఆక్యుపెన్సీ లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సరి సమానంగా 93% ఆక్యుపెన్సీ కలిగివున్నాయి.
ఇక సూపర్ స్టార్ రజిని దర్బార్ మూవీ తమిళ్ 69%, తెలుగు 52%, హిందీ 20% ఆక్యుపెన్సీ కలిగివున్నాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా , త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో చిత్రాన్ని కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. రెండు డిఫరెంట్ జోనర్స్ లో వచ్చిన ఈ చిత్రాలు బాక్సాపీస్ వద్ద తీవ్రంగా పోటీపడుతున్నాయి.