ఏపీలో “వార్ 2” టికెట్ ధరలు ఖరారు!

war2

మ్యాన్ ఆఫ్ మాసెస్ అలాగే హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ చిత్రమే “వార్ 2”. భారీ మల్టీస్టారర్ గా చేసిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా టికెట్ ధరల విషయంలో ఓ టాక్ ఉదయం నుంచి నడుస్తుంది.

అయితే డబ్బింగ్ సినిమా అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హైక్స్ ఉంటాయి అనే బజ్ లో తెలంగాణలో హైక్స్ ఉండవు అని ఖరారు అయ్యింది కానీ ఏపీలో మాత్రం టికెట్ ధరలు పెరిగాయి. సింగిల్ స్క్రీన్స్ కి ఏకంగా 75 రూపాయల హైక్ ఈ సినిమాకి వచ్చింది.

సో సింగిల్ స్క్రీన్స్ లో గరిష్ట ధర 220 గా ఫిక్స్ అయ్యింది. సెకండ్ క్లాస్ 150. ఇక ఇదే మల్టీప్లెక్స్ లకి కూడా వర్తించనుంది. ఆల్రెడీ ఏపీలో పలు చోట్ల బుకింగ్స్ మొదలయ్యాయి. అభిమానులు ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

Exit mobile version