ఫుల్ స్వింగ్ లో ‘థగ్ లైఫ్’.. రెండో ఎపిసోడ్ వచ్చేసింది!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా త్రిష, శింబు ఇంకా అనేకమంది స్టార్స్ కలయికలో లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “థగ్ లైఫ్”. మరి ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనగా మేకర్స్ మాత్రం అగ్రెసివ్ గా ప్రమోషన్స్ ని చేస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి అదే రీతిలో అన్ని భాషల ప్రమోషన్స్ ని చేస్తుండడం విశేషం.

ఇలా థగ్ టాక్స్ అంటూ స్టార్ట్ చేసిన ఓ సిరీస్ నుంచి ఒకో ఇంటర్వ్యూ వస్తుంది. మరి ఇలా సిరీస్ లో రెండో ఇంటర్వ్యూ లీడ్ నటుల నుంచి వచ్చింది. ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అంతకు మించిన సమాధానాలతో ఈ ఇంటర్వ్యూ సాగింది. ఇక ఈ భారీ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఈ జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version