పూరి సినిమాలో ఈ యంగ్ హీరో కూడా..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో దర్శకుడు పూరి జగన్నాథ్ నెక్స్ట్ మూవీ కూడా ఒకటి. తమిళ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో యంగ్ హీరో ఆకాష్ పూరి కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్త సినీ సర్కి్ల్స్‌లో వినిపిస్తోంది. ఇదే గనక నిజం అయితే, గతంలో పూరి, ఆకాష్ పూరి కాంబినేషన్‌లో రొమాంటిక్ చిత్రం వచ్చింది. ఈ సినిమా 2021లో రిలీజ్ అయ్యింది. కానీ, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే టాక్ ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తి క్రియేట్ చేసింది.

ఇక పూరి-విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో టబు, దునియా విజయ్, నివేదా థామస్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు పూరి అండ్ టీమ్ ప్రయత్నిస్తోంది.

Exit mobile version