విలన్ పాత్రని పునర్జన్మలా ఫీలవుతున్నా – జగపతి బాబు

విలన్ పాత్రని పునర్జన్మలా ఫీలవుతున్నా – జగపతి బాబు

Published on Aug 5, 2013 2:07 PM IST

Jagapathibabu
ఫ్యామిలీ హీరో జగపతిబాబు ఈ రోజు మీడియాతో ముచ్చటించారు. ఆయన ఎంతో ఫ్రాంక్ గా మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ సినిమాలో విలన్ గా కనపించనున్న విషయంలోజగపతిబాబు హ్యాపీ గా ఉన్నారు. ఈ సందర్భాన్ని ఆయన తన పునర్జన్మలా ఫీలవుతున్నారు.

‘ గతంలో నేను కొన్ని చెడ్డ సినిమాలు చేసాను. ఆ సినిమాలు ఎప్పుడు విడుదలయ్యి వేల్లిపోతున్నాయో కూడా నాకు తెలియదు. అందుకే నా సినిమాల విషయంలో కేర్ తీసుకోవాలనుకున్నాను. ఈ మార్పు నాక్కు పునర్జన్మ లాంటిదని’అన్నాడు.

అలాగే మాట్లాడుతూ ‘ నాకు బాలయ్య బాబు అంటే ఇష్టం, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అలాగే ఒక మంచి బ్యానర్ లో, ఓ మంచి దర్శకుడితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కథలో ఎంతో విషయం ఉంది. ఈ సినిమాలో నేను మూడు జెనరేషన్స్ కి సంబంధించి మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనపడతాను. అందుకోసం నా బాడీ లాంగ్వేజ్ లో చాలా మార్పు చూపించాల్సి వస్తుందని’ అన్నాడు.

ఆటనకుమ్మ లేడీ ఫ్యాన్స్ గురించి ఆయన్ని అడిగితే జగపతిబాబు సమాధానమిస్తూ ‘ కొంతమంది కాస్త బాధ పాడుతారని నాకు తెలుసు కానీ నేను నాగురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి కదా. నేను ఈ మార్పుని చాలా పాజిటివ్ గా తీసుకున్నాను. ప్రేక్షకులు కూడా నా పాత్రని అంగీకరించి, ఆదరిస్తారని ఆశిస్తున్నానని’ తెలిపాడు.

తాజా వార్తలు