ఈఏడాది ఆర్ ఆర్ ఆర్ విడుదల లేకపోవడం ఎన్టీఆర్, చరణ్ అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేమికులను ఇబ్బంది పెట్టిన అంశం. వారు 2020 లో ఓ పెద్ద మల్టీ స్టారర్ చూస్తున్నాం అని ఆశపడుతున్న తరుణంలో ఆర్ ఆర్ ఆర్ వాయిదా అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. ఐతే ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా పడటానికి ప్రధాన కారణాలలో ప్రమాదాలు ఒకటి. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నందు ఇద్దరు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ గాయాలపాలయ్యారు.
మొదట చరణ్ మోకాలికి గాయం కాగా, మరో కొద్దిరోజులలో ఎన్టీఆర్ చేతికి గాయం కావడం జరిగింది. దీనితో దాదాపు రెండు నెలలకు పైగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇంకా ప్రమాదకరమైన పోరాట సన్నివేశాలలో ఈ ఇద్దరు హీరోలు పాల్గొంటున్నట్లు సమాచారం. కాగా ఈ సారి అలా ప్రమాదాలు జరగకుండా జక్కన్న తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ప్రమాదకరమైన స్టంట్స్ చేసేటప్పుడు నిపుణులచే పర్యవేక్షణ చేయిస్తున్నాడట.