పవన్ సినిమా కోసం మహేష్ సినిమా వదులుకున్నారా?

పవన్ సినిమా కోసం మహేష్ సినిమా వదులుకున్నారా?

Published on Oct 4, 2020 8:51 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. పవన్ కంబ్యాక్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తుండగా.. మరో పక్క మరో స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే మాస్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు.

అయితే ఈ రెండు చిత్రాలకు కామన్ గా పని చేస్తున్న ఒక టెక్నిషియన్ పవన్ సినిమా వల్ల మహేష్ సినిమాకు దూరం కావాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. వకీల్ సాబ్ కు సినిమాటోగ్రఫీ అందిస్తున్న పి ఎస్ వినోద్ మహేష్ సర్కారు వారి పాట కు కూడా ఛాయాగ్రహణం అందించాల్సి ఉంది. కానీ పరిస్థితులు రీత్యా వకీల్ సాబ్ మిగిలి ఉన్న షూటింగ్ అలాగే మహేష్ సర్కారు వారి పాట షూట్ కూడా అందులోనూ యూఎస్ లో ఉండడంతో ఈ చిత్రం షూట్ ప్లాన్ చెయ్యడంతో వినోద్ వకీల్ సాబ్ కే స్టిక్ అవ్వాల్సి వచ్చింది. అలా పవన్ సినిమా కోసం మహేష్ సినిమాను వదులుకున్నారు.

తాజా వార్తలు