తెలుగు సినీ కుటుంబాల్లో ఘట్టమనేని కుటుంబం ఎప్పటిలాగే ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని మహేష్ బాబు కొనసాగిస్తుండగా, ఇప్పుడు సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు.
తాజా సమాచారం ప్రకారం, దర్శన్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హను రాఘవపూడి దర్శకత్వంలోని ‘ఫౌజీ’లో ప్రభాస్ చిన్న వయసు పాత్రలో కనిపించనున్నాడు. లుక్ టెస్ట్‌లో దర్శన్ నటనతో టీమ్ ఇంప్రెస్ అయిందని సమాచారం.
అదే సమయంలో, దర్శన్ మహేష్ బాబు నిర్మిస్తున్న ‘గుఢాచారి 2’లో కూడా కీలక పాత్రలో నటించనున్నాడని టాక్. ఘట్టమనేని వారసుడిగా దర్శన్ ఎంట్రీపై అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.


