హరీష్ శంకర్ తో ఆ స్టార్ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్..?

టాలీవుడ్ లో క్రేజీ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయన ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

ఇక ఈ సినిమా తర్వాత హరీష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఓ స్టార్ హీరోని ఓకే చేసినట్లు తెలుస్తుంది. మాస్ చిత్రాల స్పెషల్ హీరో అయినా ఈ హీరోతో మరోసారి హరీష్ చేతులు కలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తతో హరీష్ శంకర్ ఈసారి ఏ హీరోతో సినిమా చేస్తాడా.. ఇది ఎలాంటి కథతో వస్తుందా.. అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Exit mobile version