ప్రస్తుతం మొత్తం మన దేశీయ సినీ ఇండస్ట్రీలోనే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చర్చించనక్కర్లేదు. థియేటర్స్ మూత పడడంతో ఎన్నో చిత్రాలు విడుదల ఆగిపోయాయి. దీనితో అనేక సినిమాలు ఓటిటి బాట పట్టాయి. ముందుగా చిన్న సినిమాలు నుంచి ఇప్పుడు స్టార్ హీరోల చిత్రాల వరకు వచ్చేసాయి. మన దగ్గర లేటెస్ట్ గా నాని నటించిన “వి” రెడీ అవుతుండగా కోలీవుడ్ లో స్టార్ హీరో అయినటువంటి సూర్య నటించిన “ఆకాశమే నీ హద్దురా” కూడా అనౌన్స్ చెయ్యడంతో ఆ వార్త సెన్సేషన్ అయ్యింది.
ఇక అదే బాటలో అక్కడి మరో స్టార్ హీరో అయినటువంటి ధనుష్ నటిస్తున్న “జగమే తంత్రం” కూడా వస్తుంది అని వార్తలు అనేకం వినిపించాయి. కానీ ఇప్పుడు మేకర్స్ ఈ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని తేల్చి చెప్పేసారు. ఈ చిత్రాన్ని అభిమానులు మరియు తాము సిల్వర్ స్క్రీన్ మీదనే చూసేందుకు ఇష్టపడుతున్నామని నిర్మాత వై నాట్ స్టూడియోస్ అధినేత సష్ తెలిపారు. దీనితో ఈ చిత్రం ఓటిటి లో రావడం లేదని ఖరారు అయ్యింది. ధనుష్ నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
An official update #JagameThanthiram https://t.co/uda6mTgE92
— Ramesh Bala (@rameshlaus) August 26, 2020