ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ ని సెట్ చేసుకున్న చిత్రాల్లో ‘వార్ 2’ కూడా ఒకటి. మ్యాన్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్ చాలా ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఆల్రెడీ వచ్చిన టీజర్ లో క్రేజీ సీక్వెన్స్ లు ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ నడుమ ఎపిక్ క్లాష్ సన్నివేశాలు అదిరిపోయాయి.
మరి దర్శకుడు అయాన్ లేటెస్ట్ గా వీటిపైనే ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వార్ 2 లో తనకి బాగా క్లిష్టమైన పని ఏదన్నా ఉంది అంటే అది లీడ్ హీరోస్ మధ్య ఘర్షణ సన్నివేశాలు కోసమే అని చెప్పుకొచ్చారు. ఇద్దరు మధ్య యాక్షన్ సీక్వెన్స్ లు కోసం క్రియేట్ చేయాల్సిన పరిస్థితిలు ఎంతో ఛాలెంజింగ్ గా అనిపించింది అని చెప్పారు. దీనితో వార్ 2 లో ఈ సీన్స్ ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే మరి.