మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫాన్స్ కి ముందు వార్ 2 తో తారక్ ట్రీట్ ఇవ్వనున్నాడు. ఇక ఈ సినిమాల కోసం పక్కన పెడితే ఇంకో భారీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చెంతకు వచ్చినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం సిద్దం చేసిన గ్రాండ్ బడ్జెట్ సినిమా ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గరకి వెళ్లినట్లు వినిపిస్తోంది. ఇప్పుడు బన్నీ ఉన్న బిజీలో త్రివిక్రమ్ తో సినిమా ఆలస్యం అవ్వొచ్చు అని అందుకే ఎన్టీఆర్ తో చేసే వీలు ఉందని వినిపిస్తోంది. మరి ఈ టాక్ లో ఎంతవరకు నిజం ఉందో కాలమే నిర్ణయించాలి.