‘భగవంత్ కేసరి’ నుంచి కేవలం ఆ ఒక్క సీన్ నే తీసుకున్నారా?

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇపుడు ఎలాంటి ఫామ్ లో ఉన్నారో అందరికీ తెలిసిందే. మరి బాలయ్య హీరోగా నటించిన చిత్రాల్లో భగవంత్ కేసరి చిత్రాన్ని తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రీమేక్ చేస్తున్నాడని అదే చిత్రం జన నాయగన్ అంటూ అల్రెడీ టాక్ ఉంది. అయితే ఈ చిత్రాన్ని అనీల్ రావిపూడినే రీమేక్ చేయమన్నట్టు కోరినప్పటికీ అది జరగలేదు.

అయితే ఈ రీమేక్ చర్చలు ట్రైలర్, టీజర్ కి వచ్చే వరకు తేలవు కానీ లేటెస్ట్ గా ఇంకో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. జన నాయగన్ మేకర్స్ కేవలం భగవంత్ కేసరి సినిమాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సన్నివేశం తాలూకా హక్కులు మాత్రమే కొనుకున్నారట. మిగతా సినిమా అంతా వేరే అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి కేవలం ఈ ఒక సీన్ కోసం భారీ మొత్తంలో ఇచ్చే కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version