ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!

ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!

Published on Aug 21, 2025 2:04 PM IST

ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతున్న యంగ్ అండ్ స్టార్ హీరోయిన్స్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అలాగే బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ లు కూడా ఒకరు. మరి ఈ ఇద్దరు తెలుగు సహా హిందీ మార్కెట్ లలో ఫుల్ బిజీ అండ్ డిమాండ్ తో ఉన్నారు. మరి ఈ ఇద్దరు బ్యూటీస్ నటిస్తున్న బాలీవుడ్ సినిమాలు ఒకే ఓటిటి సంస్థ సొంతం చేసుకుంది.

జాన్వీ నటించిన పరం సుందరి అలాగే రష్మిక హారర్ థ్రిల్లర్ థామా సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో వారే సొంతం చేసుకున్నారు. ఇవే కాకుండా ఈ సినిమా నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ నుంచి సిద్ధత్, బద్లాపూర్ 2 ఇంకా మరిన్ని సినిమాలు తామే సొంతం చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక రష్మిక సినిమా ఈ దీపావళి కానుకగా వస్తుండగా జాన్వీ కపూర్ చిత్రం ఈ ఆగస్ట్ 29న విడుదల కాబోతుంది.

తాజా వార్తలు