కోలీవుడ్ స్టార్స్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న జన నాయకుడు అలాగే మరో స్టార్ నటుడు సూర్య నటిస్తున్న అవైటెడ్ మాస్ చిత్రం కరుప్పు కూడా ఒకటి. అయితే ఎప్పుడు నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సినిమాల క్లాష్ అనేది ఇపుడు సౌత్ సినిమా దగ్గర లేటెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ కోలీవుడ్ నుంచి విజయ్ సినిమా వచ్చే ఏడాది జనవరి 9కి ఫిక్స్ అయ్యింది.
ఇక రీసెంట్ గానే మాస్ టీజర్ తో మంచి రెస్పాన్స్ అందుకున్న సూర్య కరుప్పు కూడా అదే డేట్ లో రావాలని చూస్తున్నట్టు టాక్ మొదలైంది. అయితే ఇందుకు ఓటిటి కారణం అన్నట్టు తెలుస్తుంది. కరుప్పు ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుండగా వారు కూడా ఫెస్టివల్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. దీనితో వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లోనే ఈ సినిమా ఉండే ఛాన్స్ ఉందట. సో ఇలా సాలిడ్ క్లాష్ తప్పేలా లేదని తమిళ వర్గాలు చెబుతున్నాయి.