“కేజీయఫ్” మన ఇండియన్ ఫిల్మ్ లవర్స్ కి కొత్తగా పరిచయం చెయ్యనక్కర్లేని పేరు. మన దక్షిణాది నుంచి విడుదలై మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీలను మరోసారి కళ్ళు తిప్పనివ్వకుండా చేసింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో రికార్డులు నెలకొల్పింది.
అలా దీని తర్వాత సీక్వెల్ వస్తుంది అని తెలియగానే మొదటి పార్ట్ కంటే దీనిపై అంచనాలు డబుల్, ట్రిపుల్ అయ్యాయి. దీనితో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఒక ఆసక్తికర బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.
ఈ చిత్రం చాప్టర్ 1 కంటే భారీ యాక్షన్ తో కూడుకొని ఉంటుందని యష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పైగా ఇందులో “అధీరా” పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ కు తనకు భీకర పోరాట సన్నివేశాలే ఉంటాయని తెలిపారు. ఇప్పుడు అలాంటి పవర్ ఫుల్ రోల్ చేస్తున్న సంజయ్ దత్ సన్నివేశాలనే ఈ చిత్రంలో తగ్గించనున్నారని తెలుస్తుంది. మరి అలాంటి రోల్ కే సన్నివేశాలు ఎందుకు తగ్గిస్తున్నారో తెలియాల్సి ఉంది.