స్టార్ హీరోలను ఆ భయం పట్టి పీడిస్తుందట

స్టార్ హీరోలను ఆ భయం పట్టి పీడిస్తుందట

Published on Jun 8, 2020 8:34 AM IST


కరోనా వైరస్ ఒక్కసారిగా ప్రపంచాన్ని స్థంబింపజేసింది. అన్ని పరిశ్రమలు కూలిపోగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లోకి నెట్టబడింది. ఇక సినిమా పరిశ్రమ సైతం కుదేలయ్యింది.థియేటర్స్ బంద్ కారణంగా కొత్త చిత్రాల విడుదల ఆగిపోయింది. షూటింగ్స్ నిలిచిపోయాయి. చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం ఇప్పట్లో వచ్చే సూచనలు కనిపించడం లేదు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ కరోనా వైరస్ ప్రభావం తగ్గలేదు.

ఈ నేపథ్యంలో స్టార్ హీరోలలో గుబులు మొదలైందని తెలుస్తుంది. కరోనా వైరస్ అదుపులోకి రాని పక్షంలో థియేటర్స్ శాశ్వతంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వేళ పెద్ద సినిమాలకు కూడా థియేటర్స్ విడుదల లేకపోతే గతంలో వలే వందల కోట్ల వసూళ్లు వచ్చే అవకాశం ఉండదు. అదే జరిగితే ఓ టి టి విడుదల వలన ఆ స్థాయి వసూళ్లు రాని యెడల వీరి రెమ్యూనరేషన్స్ లో భారీ కోత పడుతుంది. కాబట్టి కరోనా వైరస్ స్టార్ హీరోలను ఆ విధంగా భయపెడుతుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు