OTT: కేవలం ఒక్క రోజులోనే ఓటిటిలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ సినిమా!

OTT: కేవలం ఒక్క రోజులోనే ఓటిటిలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ సినిమా!

Published on Jul 17, 2025 8:03 AM IST

My Baby

రీసెంట్ గా ఓటిటిలు ప్రభావం పాన్ ఇండియా వైడ్ గా ఎలా కనబడుతుందో అందరికీ తెలిసిందే. పలు భారీ సినిమాల రిలీజ్ డేట్ లు సైతం ఓటిటి సంస్థలే డిసైడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా పలు సినిమాలు మినిమమ్ మూడే వారాలు నుంచి ఎనిమిది వారాల తర్వాత ఓటిటిలోకి వస్తున్నాయి.

కానీ లేటెస్ట్ గా ఓ సినిమా మాత్రం కేవలం ఒక్క రోజులోనే ఓటిటిలోకి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ చిన్న మెలిక కూడా ఉంది. గద్దలకొండ గణేష్ నటుడు అథర్వ నటించిన రీసెంట్ తమిళ్ సినిమా “డీఎన్ఏ”. తమిళ్ లో గత జూన్ 20న విడుదల కాగా తెలుగులో రేపు జూలై 18న థియేటర్స్ లో “మై బేబీ” గా విడుదల కాబోతుంది.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తమిళ్ సహా తెలుగు వెర్షన్ లో కూడా కేవలం ఒక్క రోజు గ్యాప్ లోనే అంటే జూలై 19 నుంచి సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. ఈ సినిమా హక్కులు జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా ఈ జూలై 19 నుంచే వచ్చేస్తుంది. మరి ఇలా ఒక్కరోజు గ్యాప్ కే మేకర్స్ తెలుగు రిలీజ్ కి ఎందుకు తెచ్చుకున్నారో వారికే తెలియాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు