ఆర్ ఆర్ ఆర్ విడుదలకి కొన్ని నెలల సమయం ఉంది. భారీ క్రేజ్ ఉన్న ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్రతి రోజు ఏదో ఒక వార్తలో నిలుస్తుంది. ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. యుక్త వయసులో ఉన్న కొమరం భీమ్, అల్లూరి దొరల అన్యాయాలను చూస్తూ సహించలేక… వారిని ఏమీ చేయలేక ఇంటి నుండి పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారట. ఆ సమయంలోనే వీరిద్దరూ అజయ్ దేవ్ గణ్ ని కలుస్తారట. వీరిలో కసిని శక్తిగా మార్చే గురువుగా అజయ్ దేవ్ గణ్ కనిపిస్తారట. వీరిద్దరికీ అన్ని యుద్ధ విద్యలు నేర్పి పోరాటానికి అజయ్ దేవ్ గణ్ సిద్ధం చేస్తాడని వినికిడి. ఆర్ ఆర్ ఆర్ కథ అసలు మలుపులు అక్కడే తీసుకుంటుందట. వినడానికి చాలా ఎక్సయిటింగ్ గా ఉన్న ఈ రూమర్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.
రాజామౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ఐదు భాషలలో విడుదల చేస్తున్నారు. నిర్మాత డి వి వి దానయ్య 400కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ జనవరి 8, 2021 లో విడుదల కానుంది.