మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో మూవీ ప్రకటించినప్పటి నుండి ఈ మూవీ స్టోరీ లైన్ పై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి జనజీవన స్రవంతిలో కల్సిన నక్సలైట్ గా కనిపిస్తాడని, పురాతన టెంపుల్స్ వారసత్వ సంపదను కాపాడడానికి పోరాడే ప్రొఫెసర్ లా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. ఐతే తాజాగా ఓ ఇంగ్లీష్ డైలీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చిరంజీవి ఆచార్య మూవీ స్టోరీ లైన్ చెప్పారు. ఆయన ప్రకారం ఆచార్య ఓ పొలిటికల్ థ్రిల్లర్ అట. ప్రకృతి వనరులను కాపాడే ఓ వ్యక్తి పోరాటంగా ఈ చిత్రం ఉంటుందట.
కొరటాల శివ గత చిత్రాల మాదిరి సోషల్ మెస్సేజ్ అందిస్తూనే ఫ్యాన్స్ కి కావాలసిన కమర్షియల్ అంశాలు కలగలిపి ఈ మూవీ ఉంటుందట. ఇక కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మరోమారు చిరంజీవికి జంటగా నటిస్తుంది. ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.