తండ్రి ఆర్ధిక కష్టాలు తీర్చడానికి హీరో అయ్యాడు

తండ్రి ఆర్ధిక కష్టాలు తీర్చడానికి హీరో అయ్యాడు

Published on Apr 30, 2020 11:39 PM IST

సినీ వారసత్వంలో రిషి కపూర్ మూడవతరం హీరో. ఆయన తాత పృథ్విరాజ్ కపూర్, తండ్రి రాజ్ కపూర్ నటులే. తన తండ్రి నటించిన మేరా నామ్ జోకర్ సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రిషి కపూర్ బాలనటుడిగా జాతీయ అవార్డు గెలుపొందారు. ఇక హీరోగా 1973లో వచ్చిన బాబీ ఆయన మొదటి చిత్రం. రిషి కపూర్ తండ్రి రాజ్ కపూర్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం. విశేషం. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్.

ఐతే ఆ సినిమాలో హీరోగా నటించడం వెనుక తండ్రి రాజ్ కపూర్ కి ఉన్న ఆర్థిక ఇబ్బందులే కారణం అని రిషి కపూర్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. నిజానికి బాబీ సినిమాలో హీరోగా రాజేష్ ఖన్నాను తీసుకోవాలని రాజ్ కపూర్ అనుకున్నారట. ఐతే రాజేష్ ఖన్నాకు రెమ్యూనరేషన్ ఇవ్వలేక రాజ్ కపూర్ కొడుకు రిషి కపూర్ ని హీరోగా పరిచయం చేశాడట. అలా తండ్రి ఆర్థిక కష్టాలు తీర్చడం కోసం ఆయన హీరో అయ్యాడు. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో రాజ్ కపూర్ కి బాగా లాభాలు వచ్చాయట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు