మహేష్ ను అమితంగా భయపెట్టిన ఈ చిత్రం.!

మహేష్ ను అమితంగా భయపెట్టిన ఈ చిత్రం.!

Published on Oct 6, 2020 8:00 AM IST

ఈ ఏడాది వచ్చిన లాక్ డౌన్ మూలాన డిజిటల్ కంటెంట్ కు ఎంత ప్రాధాన్యం సంతరించుకుందో అందరికీ తెలిసిందే. ఇళ్లకే పరిమితం అయ్యిన వారు అంతా ఈ కంటెంట్ తోనే ఎంటర్టైన్ పొందారు. అయితే ఈ లాక్ డౌన్ మన టాలీవుడ్ హీరోలకు కూడా ఎప్పుడూ రానంత స్థాయి విరామం దొరకడంతో వారు కూడా మరింత స్థాయిలో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో కంటెంట్ ను వీక్షించారు. అలా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ లాక్ డౌన్ లో చాలా వరకు డిజిటల్ కంటెంట్ ను వీక్షించారు.

అయితే మహేష్ ను మాత్రం హార్రర్ జానర్ లో ఒక చిత్రం అమితంగా భయపెట్టింది అని అంటున్నారు. తాను ఇప్పటి వరకు హర్రర్ జానర్ లో ఎన్నో చిత్రాలు చూసా కానీ నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ “సోషల్ డిలేమా” అనే చిత్రం మాత్రం అన్నిటికన్నా ఎక్కువ భయపెట్టింది అని అది ఇచ్చిన థ్రిల్ ఇప్పటికీ తనకు అనిపిస్తుంది అంటూ మహేష్ ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రాన్ని రికమెండ్ చేసారు. ఇక ఇక్కడ నుంచి ఈ చిత్రానికి మరిన్ని వ్యూస్ పెరగడం ఖాయం అని చెప్పాలి.

తాజా వార్తలు