బన్నీ కోసం పూరి హీరోయిన్..?

బన్నీ కోసం పూరి హీరోయిన్..?

Published on May 1, 2020 10:04 AM IST

అల్లు అర్జున్ సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేశారు. పుష్ప టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐదు భాషలలో దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దర్శకుడు సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా బన్నీ రాయలసీమ చిత్తూరుకి చెందిన మొరటు కుర్రాడుగా కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ ఓ మంచి మసాలా ఐటెం సాంగ్ ఉంటుందని హింట్ ఇచ్చారు.

ఈ సాంగ్ లో బన్నీకి జంటగా కాలుకదపనున్న ఐటమ్ భామ కోసం సుకుమార్ వెతుకుతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయన బాలీవుడ్ నుండి ఓ పాపులర్ హీరోయిన్ ని తేవాలని చూస్తున్నారని కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో హాట్ బ్యూటీ దిశా పటాని ని సుకుమార్ దాదాపు ఒకే చేసినట్లు తెలుస్తుంది. గతంలో దిశా బన్నీ డాన్సులకు పెద్ద ఫ్యాన్ ని అని చెప్పిన తరుణంలో ఆమె దాదాపు ఒకే అయ్యే అవకాశం కలదని అంటున్నారు. ఇక దిశా 2015లో వరుణ్ హీరోగా పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ సినిమాలో నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు