పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో చేస్తున్న భారీ చిత్రం “స్పిరిట్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం విషయంలో పలు ఇంట్రెస్టింగ్ అంశాలే ఇపుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణ్ ఈ సినిమా నుంచి వైదొలగింది అని టాక్ వైరల్ గా మారగా ఇపుడు ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ లాక్ అయ్యినట్టుగా కొత్త టాక్ మొదలైంది.
అయితే ఈ సారి హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజం అయితే ఒక ఊహించని కాంబినేషన్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా టీ సిరీస్, భద్రకాళి ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.