ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తీస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ వండర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మన తెలుగు నుంచి బాహుబలి తర్వాత ఆ రేంజ్ తారా స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ టీజర్ తారక్ పై డిజైన్ చెయ్యబడింది అతి త్వరలో రానుంది.
అయితే టీజర్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రతీ ఒక్కరు. అలాగే రాజమౌళి ఒక కీ ఎలిమెంట్ ను ఈ టీజర్ లో చూపిస్తారా చూపించరా? అన్న సరికొత్త ప్రశ్న ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ గా మారింది. ఈ చిత్రంలో అల్లూరిగా కనిపించిన రామ్ చరణ్ కు తారక్ కొమరం భీమ్ లా ఇచ్చిన వాయిస్ ఓవర్ కు ట్రెమండ్యస్ రెస్పాన్స్ వచ్చింది.
మరి ఇప్పుడు తారక్ పై డిజైన్ చేయబోయే టీజర్ కు కూడా రామ్ చరణ్ అల్లూరిగా వాయిస్ ఓవర్ ఇస్తారని అంతా ఆశిస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఈ విషయంలో ఎందుకో మౌనంగా ఉండడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనితో తారక్ పై ప్లాన్ చేయనున్న టీజర్ విషయం లో ఈ ఒక్క అంశం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.